News March 10, 2025
జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
Similar News
News February 9, 2026
గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు.
News February 9, 2026
ADB: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.
News February 9, 2026
ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకమని, కౌంటింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.


