News September 23, 2024
జిల్లా అభివృద్ధే లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్: కలెక్టర్ దినకర్

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్లో జిల్లా స్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ వికసిత భారత్లో భాగంగా అక్టోబరు 5 వరకు నిర్వర్తించవలసిన కార్యాచరణను వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 27, 2025
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025
టెక్కలి: సెప్టిక్ ట్యాంక్లో పడి చిన్నారి మృతి

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.