News September 5, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 130 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 130 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నల్లగొండ జిల్లాలోని వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోగా మండల కమిటీ పలు ఉపాధ్యాయుల పేర్లను సూచిస్తూ జిల్లా అధికారులకు నివేదిక పంపించింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకోనున్నారు.

Similar News

News September 8, 2024

జాతీయ రహదారిపై కారులో మంటలు

image

చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

News September 8, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాగర్ గేట్లు, జల విద్యుత్ కేంద్రం, ఎత్తిపోతల జలపాతం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News September 8, 2024

ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.