News July 20, 2024

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సీఎస్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల అశ్వరావుపేటలోని పెద్దవాగుకు గండిపడి భారీగా వరద సంభవించింది. ఈ ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందిని ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో అభినందించారు.

Similar News

News November 24, 2025

ఖమ్మం నుంచి సూర్యలంక బీచ్‌కు ఆర్టీసీ డీలక్స్‌ బస్సు

image

ఖమ్మం కొత్త బస్టాండ్‌ నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు డీలక్స్‌ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న (ఆదివారం) ఉ.6.00 గంటలకు ఈ సర్వీసు నడుస్తుందన్నారు. టికెట్‌ ధర పెద్దలకు ₹1,000, పిల్లలకు ₹530గా నిర్ణయించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 23, 2025

ఖమ్మం: నాటక రంగాన్ని బతికించడంలో నెల నెల వెన్నెలది గొప్ప పాత్ర

image

‘నెల నెల వెన్నెల’ వందో నెల వేడుకకు కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మొబైల్స్‌కు అలవాటు పడిన ప్రేక్షకులను నాటకరంగం వైపు ఆకర్షిస్తున్న ‘నెల నెల వెన్నెల’ కృషిని ఆయన కొనియాడారు. భక్త రామదాసు కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతి తరహాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘చీకటి పువ్వు’ నాటిక ప్రదర్శన జరిగింది.