News April 8, 2025
జిల్లా కలెక్టర్, ఎస్పీని అభినందించిన మంత్రి

భద్రాచలంలో ఆదివారం జరిగిన శ్రీసీతారాముల కళ్యాణం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్లను మంత్రి తుమ్మల అభినందించారు. కలెక్టర్, ఎస్పీలకు ఒకేసారి షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరకు తీసుకున్నారు. సీఎం, లక్షలాదిమంది భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని మెచ్చుకున్నారు.
Similar News
News November 18, 2025
నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
News November 18, 2025
RGM: సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జి వద్ద, అంతర్గాం మండలం గోలివాడ జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.
News November 18, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.


