News May 26, 2024

జిల్లా కలెక్టర్ పై మండిపడ్డ మంత్రి కాకాణి

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్‌లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.

Similar News

News January 21, 2025

బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే

image

బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 

News January 21, 2025

నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు

image

నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.

News January 21, 2025

జేఈఈ మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే JEE మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ, పొట్టేపాలెం ఇయాన్ డిజిటల్ జోన్, తిరుపతి జిల్లా కోటలోని NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలలో పరీక్షలు జరుగుతాయన్నారు.