News April 13, 2025
జిల్లా టాపర్గా నందికొట్కూరు కుర్రాడు

ఇంటర్ ఫలితాల్లో నందికొట్కూరుకు చెందిన షేక్ మహమ్మద్ అఖిల్ 1000/990 మార్కులతో సత్తాచాటారు. నంద్యాల జిల్లా మొదటి ర్యాంక్ సాధించారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కష్టపడి చదివినందుకు తగిన ప్రతిఫలం దక్కిందని యువకుడు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ బద్దుల శ్రీకాంత్, ఛైర్మన్ శ్రీధర్రెడ్డి, మ్యాథ్స్ లెక్చరర్ మధు విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Similar News
News December 25, 2025
శివస్వరూపంగా శ్రీనివాసుడు

తిరుమల మూలవిరాట్టును పూర్వం విష్ణు రూపమని కొందరు, శైవ రూపమని మరికొందరు భావించారు. స్వామివారి తలపై ఉండే జటలు, కంఠంలోని నాగభూషణాలు చూసి శివుడిగానూ ఆరాధించారు. విగ్రహానికి ఉన్న విలక్షణ లక్షణాలు శివ, కేశవ ఇరువురినీ స్మరింపజేస్తాయి. అందుకే ఇప్పటికీ తిరుమలలో శైవ, వైష్ణవ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. విష్ణుమూర్తి సర్వవ్యాపి అని, ఆయనలో శివుడు కూడా అంతర్భాగమని చెప్పడానికి ఈ రూపం గొప్ప నిదర్శనం.
News December 25, 2025
SRD: విషాదం.. సర్పంచ్ మృతి

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపుర్ (ఎన్) గ్రామ సర్పంచ్ ఎర్రోల్ల అక్కమ్మ (61) బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతురాలుగా పోటీ చేసి గెలుపొందారు. అక్కమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 22న పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అకాల మరణం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
News December 25, 2025
ఈ ఏడాది కామారెడ్డి పోలీసుల భారీ విజయం

అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. SP రాజేష్ చంద్ర 2025 వార్షిక నివేదికలో వెల్లడించిన వివరాలిలా.. ఈ కేసుకు సంబంధించి 8 రాష్ట్రాల్లో దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎనిమిది మందిపై PD యాక్ట్ ప్రయోగించారు. వీరి నుంచి నకిలీ నోట్లు, నగదు, ముద్రణ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని SP స్పష్టం చేశారు.


