News April 5, 2025
జిల్లా నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం

ఈనెల 27న వరంగల్ వేదికగా BRS పార్టీ ఆవిర్భావం సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భద్రాద్రి జిల్లా ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రజతోత్సవ వేడుకలపై జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
NGKL: ‘జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి’

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.
News February 23, 2026
జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత కార్యక్రమం పరిశీలనలో భాగంగా కేంద్ర బృందం జనగామ జిల్లాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వారు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 6 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టనుంది.
News February 23, 2026
89,000 మంది ఉద్యోగులతో జనగణన: CS

TG: కేంద్రం నిర్దేశించిన జనగణన-2027 ప్రక్రియకు సన్నాహాలపై క్యాబినెట్ చర్చించింది. తొలుత మే 11 నుంచి జూన్ 9వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతుందని CS రామకృష్ణారావు భేటీలో మంత్రులకు వివరించారు. హౌస్ లిస్టింగ్‌కు కేంద్రం 34 ప్రశ్నల నమూనాను పంపిందని చెప్పారు. ఎన్యుమరేటర్లు, నోడల్ ఆఫీసర్లు కలిపి 89,000 మంది ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటారని తెలిపారు. 2వ దశ జనగణన 2027లో ఉంటుందని వివరించారు.


