News January 28, 2025
జిల్లా నుంచి ఉత్పత్తుల ఎగుమతి పెంచాలి: MNCL కలెక్టర్

మంచిర్యాల జిల్లా నుంచి ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా ఉత్పత్తుల ఎగుమతి అంశంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయ, పరిశ్రమల రంగాలను ప్రోత్సహిస్తూ ఉత్పత్తుల ఎగుమతి శాతాన్ని పెంపొందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ ఉత్పత్తి ఉత్పాదకతను పెంచాలన్నారు.
Similar News
News November 28, 2025
HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

నకిలీ IPS శశికాంత్‌ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్‌కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచ్‌పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.
News November 28, 2025
కంటోన్మెంట్లో నామినేటెడ్ పదవి కోసం బీజేపీ నేతల పోటీ !

కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ పదవి కాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతల్లో పోటీ పెరిగింది. గత ఉపఎన్నికల్లో అభ్యర్థి డా. వంశీతిలక్ ఈసారి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని కోరగా, బొల్లారానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిరణ్‌కుమార్ ముదిరాజ్ పదవిని ఆశిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్ నాయకులు ఎంపీ ఈటలను కలుస్తున్నారు. ఈ కీలక నామినేటెడ్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.
News November 28, 2025
ఏలూరు: మరో మూడు రోజులే గడువు

పీఎంఏవై (గ్రామీణ) – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారు, స్థలం లేని నిరుపేదలు, అసంపూర్తిగా ఇళ్లు ఉన్నవారు ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.


