News August 17, 2024

జిల్లా పంచాయతీ అధికారి పై జిల్లా కలెక్టర్ వేటు

image

ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి హరి కిషన్ పై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వేటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ అధికారి హరి కిషన్ ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీరి స్థానంలో జడ్పీ ఉప సీఈఓ నాగలక్మికి DPO గా జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Similar News

News January 6, 2026

నేటి నుంచే విద్యుత్ ‘ప్రజా బాట’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా బాట’ కార్యక్రమం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మండలాల వారీగా ఈ శిబిరాలు నిర్వహిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు.

News January 6, 2026

ఖమ్మం : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడి తొలగింపు

image

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం పాఠశాలలో పనిచేస్తున్న జి.వీరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు సస్పెన్షన్ వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం నివేదిక ఆధారంగా డీఈఓ ఈ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు.

News January 6, 2026

KTR ఖమ్మం పర్యటన వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

image

మాజీ మంత్రి KTR రేపు ఖమ్మం రానున్న తరుణంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరి BRSకు ఝలక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ బలం గణనీయంగా తగ్గింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రి తుమ్మల పావులు కదుపుతుండగా, మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాటలో ఉన్నట్లు సమాచారం. కీలక నేత పర్యటనకు ముందే ఈ వలసలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.