News June 21, 2024
జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తాం: ఎస్పీ దీపిక

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.
Similar News
News November 17, 2025
VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.

VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.