News April 25, 2024

జిల్లా పోలీస్ అబ్జర్వర్‌గా అశోక్ టి.దుధే

image

ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ అబ్జర్వర్ అశోక్ టి.దుధే ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీసు పరిశీలకులుగా ఆయన నియమితులయ్యారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో ఆయన అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో 7569618685, policeobserver73@gmail.com ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.

Similar News

News October 25, 2025

రిజిస్ట్రేషన్స్ కోసం వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి : జిల్లా రిజిస్ట్రార్

image

ప్రభుత్వం ఎవ్వరినీ దస్తావేజు లేఖరులుగా నియమించలేదని, లైసెన్స్ ఇవ్వలేదని ప్రజలు తమకు తామే IGRS (www.registration.ap.gov.in) వెబ్ సైట్లో ఉన్న నమూనాలను ఉపయోగించుకుని దస్తావేజులు తయారు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రారు బాలాంజనేయులు తెలిపారు. చలానాలు చెల్లించి ప్రజలకు కావలసిన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్-రిజిస్ట్రార్లని సంప్రదించి తమ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

News October 25, 2025

కర్నూలు ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: MP

image

కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులను MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తన తరపున రూ.5 లక్షలను కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అదేవిధంగా గుడ్లూరు(M) దారకానిపాడు హత్యోదాంత బాధితులను MLA ఇంటూరి నాగేశ్వరావుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు.

News October 25, 2025

నెల్లూరు: సమ్మె విరమించిన PHC వైద్యులు

image

నెల్లూరు జిల్లాలోని PHC వైద్యులు సమ్మె విరమించి ఇవాళ నుంచి విధులకు హజరవుతున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి 2025-26 విద్యా సంవత్సరంలో PG మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు హామీ ఇచ్చారని, ట్రైబల్ అలవెన్స్, టైంబౌండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, అర్బన్ సర్వీస్ ఎలిజిబులిటీ ఐదేళ్లకు కుదింపు వంటిసమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు.