News December 13, 2024

జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా

image

రేపు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్ లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించగలరని కోరారు.

Similar News

News November 17, 2025

నెల్లూరు: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News November 16, 2025

రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

News November 16, 2025

నెల్లూరు: బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై ఆత్యాచారం

image

గుంటూరు రూరల్‌కు చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్‌లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం సహకరించిన వారికి కూడా సమాన శిక్ష వర్తిస్తుందని పోలీసులు తెలిపారు.