News June 5, 2024
జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం
గుమ్మనూరు జయరామ్‌కు గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 13, 2024
ATP: ఇటీవలే పెళ్లి.. గుండెపోటుతో యువకుడి మృతి
విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే యువకుడు గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు బాబా ఫక్రుద్దీన్‌కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News November 13, 2024
గుత్తి వద్ద చిరుత సంచారం!
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారు కర్నూల్ రోడ్డులోని మోడల్ స్కూల్ సమీపం గుట్టల్లో మంగళవారం రాత్రి చిరుత కలకలం రేపింది. స్థానికులు గమనించి భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కొండ గుట్టల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం ఉదయం కూడా మరోసారి చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
News November 13, 2024
ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. శిక్ష ఏంటంటే?
బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన ఆదినారాయణ(54) ఓ బాలికను 2020 నవంబర్ 18న మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో జీవితఖైదు(బతికినన్ని రోజులు జైలులోనే ఉండాలి)తో పాటు రూ.1000 ఫైన్ వేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.