News February 26, 2026

జిల్లా మొత్తం విద్యుత్ సరఫరా.. ట్రాన్స్‌మిషన్ సమస్యలపై చర్చ

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో గురువారం విద్యుత్ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో శాఖ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా మొత్తం విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌మిషన్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారంపై సమావేశంలో మాట్లాడారు. కొత్త మౌలిక సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలను సూచించారు.

Similar News

News April 16, 2026

2,078 మంది ఫెయిల్

image

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.

News April 16, 2026

కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.