News May 22, 2024

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

image

కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సీల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖల కార్యక్రమాలు ప్రతివారం సమీక్షిస్తామని అన్నారు.

Similar News

News October 29, 2025

సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.

News October 29, 2025

కృష్ణా: అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాను వణికించిన తుపాన్‌లివే.!

image

1968 నవంబర్‌లో వచ్చిన భారీ తుఫాన్ కృష్ణా జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబర్‌లో 180 కి.మీ వేగంతో వీచిన గాలుల తుఫాన్‌తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్ల్‌న్‌లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013 నీలం, పైలాన్ తుపాన్‌లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్‌హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.

News October 29, 2025

కృష్ణా: సర్వర్ డౌన్.. డిజిటల్ పేమెంట్స్‌కు అంతరాయం

image

జిల్లా పరిధిలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో తుపాను ప్రభావం కారణంగా డిజిటల్ పేమెంట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో వ్యాపారులు నగదు లావాదేవీలకే పరిమితమయ్యారు. విద్యుత్ అంతరాయాలు, నెట్‌వర్క్ సమస్యలు ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.