News January 25, 2025
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. వాహదారులు తాగి డ్రైవ్ చేయొద్దని సూచించారు.
Similar News
News October 23, 2025
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 23, 2025
సిద్దిపేట: డిసెంబర్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్

డిసెంబర్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలో ఆయన మాట్లాడుతూ.. 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. నిబంధనలకు లోబడి కట్టిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నారు. డిసెంబర్లో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని వెల్లడించారు.
News October 23, 2025
NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.