News May 4, 2024
జిల్లా వ్యాప్తంగా 13,536 మందికి పోస్టల్ బ్యాలెట్లు: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 13,536 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 14,640 మంది ఉద్యోగుల్లో 13,536 మంది మే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

ప్రొద్దుటూరు: రూ.10 లక్షల పెనాల్టీ.!

ప్రొద్దుటూరులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారంపై జీఎస్టీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, కొరియర్ కార్యాలయాలు వందకుపైగా ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మందులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వీటిపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం దాడులు చేసి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు పైగా పెనాల్టీ వసూలు చేశారు.