News April 24, 2025
జిల్లా వ్యాప్తంగా 31 కేసులు

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు
Similar News
News April 25, 2025
ADB: వివాహేతర సంబంధం.. భార్యను చంపిన భర్త

గుడిహత్నూర్ మండలకేంద్రంలో భర్త చేతిలో భార్య కీర్తి (25) దారుణ హత్య విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కీర్తి భర్త మారుతి 5 ఏళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. సదరు మహిళను ఇంటికి తీసుకువస్తానని భర్త చెప్పడంతో గురువారం భార్య మందలించింది. ఇరువురి మధ్య గొడవ జరిగి భార్యను గొడ్డలితో దారుణంగా నరికాడు. తర్వాత మారుతి పరారయ్యాడు.
News April 25, 2025
ADB: మే 4న NEET.. కలెక్టర్ సమీక్ష

UGC, NEET (నీట్) నిర్వహణపై గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సంబంధిత అధికారులు, ప్రిన్సిపల్స్‌తో సమీక్ష నిర్వహించారు. మే 4వ తేదిన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
News April 24, 2025
పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్‌లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.