News January 1, 2025

జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్ 

image

నూతన సంవత్సర సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అదే విధంగా జిల్లా అధికారులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది మోడల్ గ్రామాలుగా ప్రకటించేలా చొరవచూపాలని కోరారు.

Similar News

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News January 7, 2026

ప.గో జిల్లా జేసీ హెచ్చరిక

image

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని జేసీ రాహుల్ హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742‌కు తెలియజేయాలన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రిటైల్ డీలర్లతో సమీక్షించారు.