News April 8, 2025
జి. కొండూరులో గోడ కూలి ఒకరి మృతి

జి. కొండూరు (M) పినపాకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉయ్యూరు మంగారావు (46) ఇబ్రహీంపట్నం బస్సు డిపో కండక్టర్‌గా పని చేస్తున్నారు. సాయంత్రం వాకింగ్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీగా ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో ఆయన గోడ పక్కకు వెళ్లగా గోడ కూలి మంగారావు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మైలవంరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News December 9, 2025
నేడు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్న సీఎం

TG: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. అటు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఇవాళ రాత్రి డ్రోన్ ప్రదర్శన చేయనున్నారు. నిన్న భారీ ఎత్తున పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా ఇవాళ మరిన్ని కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది.
News December 9, 2025
చిత్తూరు: ముగిసిన పులుల గణన

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌కు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణనను అధికారులు నిర్వహిస్తున్నారు.


