News April 8, 2025

జి. కొండూరులో గోడ కూలి ఒకరి మృతి

image

జి. కొండూరు (M) పినపాకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉయ్యూరు మంగారావు (46) ఇబ్రహీంపట్నం బస్సు డిపో కండక్టర్‌గా పని చేస్తున్నారు. సాయంత్రం వాకింగ్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీగా ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో ఆయన గోడ పక్కకు వెళ్లగా గోడ కూలి మంగారావు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మైలవంరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News April 20, 2025

ఈనెల 23న సాలూరులో జాబ్ మేళా: కలెక్టర్

image

సాలూరు శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా జరగనుందని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు.

News April 20, 2025

రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 20, 2025

జిల్లాలో నేను పెట్టిన రేట్లే ఉండాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

image

ప్రైవేటు బస్సు యజమానులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఓనర్లం చిల్లర వ్యక్తులం అయ్యామని అన్నారు. తాను అనంతపురం జిల్లాలో మీటింగ్ పెడుతున్నానని తెలిపారు. జిల్లాలో నేను పెట్టిన రేట్లు మాత్రమే ఉండాలని అన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా బస్సులు తిప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తాను మొదటిసారిగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడపానని తెలిపారు.

error: Content is protected !!