News March 19, 2025
జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.
Similar News
News March 19, 2025
పేద, మధ్య తరగతి ప్రజలే హైడ్రా లక్ష్యమా?: హైకోర్టు

TG: హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలే దాని లక్ష్యమా? అని ప్రశ్నించింది. పెద్దల అక్రమ భవనాలనూ కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అని నిలదీసింది. దుర్గంచెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించలేదని దుయ్యబట్టింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలంది.
News March 19, 2025
త్వరలో భారత్కు సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దీంతో ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్లో బంధువులు సంబరాలు చేసుకున్నారు. 9 నెలల తర్వాత సునీత సేఫ్గా భూమిపైకి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె సోదరి ఫాల్గుణి పాండ్య తెలిపారు. తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు.
News March 19, 2025
ఏలూరు జిల్లాలో రూ.13,277 కోట్లు రుణాలు

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ వరకు రూ.6,639 కోట్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ.15,778 కోట్లకు ఇంతవరకు 13,277 కోట్లు రుణాలు అందించారని, మార్చి చివరినాటికి 100% లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60% ఉండాల్సి ఉండగా, జిల్లాలో ఇది 199%గా ఉండటం మంచి పరిణామమన్నారు.