News January 23, 2025
జి.సిగడాం: అంత్యక్రియలకు ఏర్పాటు.. అంతలో ట్విస్ట్

మండలంలోని సీతంపేటకి చెందిన ధర్మవరపు అప్పారావు(85) అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రోగం నయం కాకపోవడంతో బుధవారం హాస్పిటల్ నుంచి గ్రామానికి అంబులెన్స్ లో తీసుకొస్తుండగా చలనం లేకపోవడంతో అప్పారావు మృతి చెందినట్లు బంధువులు భావించారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. ఆయన ఇంకా బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందించారు.
Similar News
News February 10, 2025
శ్రీకాకుళం: ఈ రోజు ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం ఆదాయ వివరాలను ఈవో భద్రాజి వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.6,78,600 లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,16,454లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ.2,68,175లు వచ్చాయన్నారు. మొత్తం రూ. 10,63,229 సమకూరినట్లు ఆయన తెలిపారు.
News February 9, 2025
‘తండేల్’ సినిమాలో మూలపేట మహిళ

ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం మూలపేటకు చెందిన రాజ్యలక్ష్మి (రాజి)కి దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సముద్ర తీర ప్రాంతమైన మూలపేట గ్రామానికి చెందిన ఆమె, ఇంతకుముందు పలు సీరియల్, సినిమాల్లో నటించారు. కూలీ నిమిత్తం వెళ్లి పాకిస్థాన్ జైల్లో ఉంటున్న వ్యక్తి భార్యగా, ఆమె మత్స్యకార మహిళ పాత్రలో ‘తండేల్’ సినిమాలో నటించడం విశేషం.
News February 9, 2025
కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.