News August 31, 2024
జి.సిగడాం: వారం రోజులలో 5 మంది మృతి
జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కోల నాగమ్మ శనివారం డయేరియా బారిన పడి మృతి చెందిందని తెలిపారు. వారం క్రితం నలుగురు మరణించగా, 30 మంది రాజాం, శ్రీకాకుళంలో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. మరణించిన ఇద్దరిలో ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు ఉండడంతో విషాదఛాయలు అలముకున్నాయి. చర్యలు చేపట్టాలని కోరుతన్నారు.
Similar News
News September 16, 2024
శ్రీకాకుళం: చనిపోయినా కష్టాలే..!
శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత కూడా కొందరికీ కష్టాలు తప్పడం లేదు. జలుమూరు మండలం తలతరియా పంచాయతీ లింగాలపాడులో సోమవారం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానిక గ్రామంలోని దళితుల శ్మశానానికి సరైన దారి లేదు. ఈక్రమంలో నడుము లోతు నీటిలో చిన్న గట్టు వెంబడి మృతదేహాన్ని ఇలా తరలించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ రహదారి సౌకర్యం కల్పించలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
News September 16, 2024
రాష్ట్రస్థాయి పోటీల్లో సిక్కోలు క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సిక్కోలు జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వేదికగా ఈనెల 13, 14, 15వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా బాలుర జట్టు ద్వితీయస్థానం, బాలికల జట్టు తృతీయ స్థానాలను సొంతం చేసుకుంది. విజేతలకు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోత పూర్ణచంద్రరావు, పీవీజీ కృష్ణంరాజు అభినందనలు తెలిపారు.
News September 16, 2024
ఓడినా అప్పలరాజుకు బుద్ధి రాలేదు: మంతెన
రాష్ట్రంలో ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యనే తెలియని మాజీ మంత్రి అప్పలరాజు ఎంబీబీఎస్ సీట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండడిపడ్డారు. ‘అప్పలరాజు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. అందుకే చంద్రబాబు మెడికల్ సీట్లు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. పలాస ప్రజలు ఆయనను ఓడించినా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా అప్పలరాజు నోరు తగ్గించుకోవాలి’ అని మంతెన సూచించారు.