News December 18, 2024
జీకె వీధి: లారీ డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

జీకే వీధి మండలం ఆర్వీ నగర్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి. గోవర్ధన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. 2017 ఏప్రిల్ 19న ఆర్.వీ నగర్ జంక్షన్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అనంతరం లారీ డ్రైవర్ భయంతో కిందికి దూకడంతో లారీ ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు.
Similar News
News January 5, 2026
కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్లు: పీతల మూర్తి ఫిర్యాదు

జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముడసర్లోవ భూములపై రక్షణ ఏర్పాటు చేసి కబ్జాలు తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. గుర్రాల పార్కు టెండర్ రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆరు కోట్ల రూపాయలు టెండర్లు ఖరారు చేశారని ఆరోపించారు. ఇటీవల అధికారులు కూడా కౌన్సిల్‌కు తెలియకుండా చెల్లింపులు చేశారన్నారు.
News January 5, 2026
అధికారులకు విశాఖ కలెక్టర్ వార్నింగ్

విశాఖ కలెక్టరేట్లో సోమవారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. భూములకు సంబంధించి వస్తున్న సమస్యలను వీలైనంతవరకు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు, రాజకీయ నాయకులు చెప్పిన వారి నుండే అర్జీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలా చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు. భూసమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
News January 5, 2026
విశాఖలో నో వెహికల్ జోన్ ఉందా? లేదా?

విశాఖ నగరంలో కాలుష్య నివారణకు జీవీఎంసీ పటిష్ట చర్యలను చేపట్టి గతంలో ప్రతి సోమవారం ‘నో వెహికల్ జోన్’ ప్రకటించింది. దీంతో జీవీఎంసీ మేయర్, కమిషనర్ సైతం ఆర్టీసీ బస్సులలో, సైకిల్ పైనా జీవీఎంసీ కార్యాలయానికి వచ్చేవారు. ఆ విధంగా వస్తూ ప్రతివారం వార్తలలో కనిపించేవారు. అయితే మేయర్ మారిన తరువాత నుంచి నో వెహికల్ జోన్‌పై వార్తా కథనాలు రాకపోవడంతో అసలు నో వెహికల్ జోన్ ఉందా లేదా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు.


