News December 18, 2024

జీకె వీధి: లారీ డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

image

జీకే వీధి మండలం ఆర్వీ నగర్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి. గోవర్ధన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. 2017 ఏప్రిల్ 19న ఆర్.వీ నగర్ జంక్షన్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అనంతరం లారీ డ్రైవర్ భయంతో కిందికి దూకడంతో లారీ ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు.

Similar News

News January 19, 2025

విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

image

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.

News January 19, 2025

మాకవరపాలెం: ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన ఆర్మీ జవాన్ గూనూరు భరత్(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేసేవాడు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించిన యువతి దూరమవుతుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామం తీసుకువచ్చారు.

News January 19, 2025

భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు

image

వైసీపీ అధినేత జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను, పరిశీలకులను మారుస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను)ని నియమించారు. మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు.