News January 25, 2025
జీకేవీధి: జర్రెలలో శతాధిక వృద్ధుడు మృతి

జీకేవీధి మండలంలోని జర్రెలలో 115 ఏళ్ల వయసున్న సాగిన భాస్కర్ రావు మృతి చెందారు. ఈ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ గుర్తింపు పొందారు. వందేళ్లపై వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఉంటూ పిల్లలకు పాఠాలు చెబుతుండడంతో పంతులు బుడ్డడు అని పిలిచేవారు. ఉత్సాహంగా ఉండే ఆయన శుక్రవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఆయన వద్ద చదువుకున్న శిష్యులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News March 2, 2026
విశాఖ: కాంట్రాక్టర్లుగా వర్క్ ఇన్‌స్పెక్టర్లు..!

GVMC ఇంజినీరింగ్ విభాగంలో కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు అనుబంధ కాంట్రాక్టర్ల పేర్లతో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల కొలతలు తీసి ఎం-బుక్ నమోదు కోసం ఏఈలకు అందజేస్తున్నారని సమాచారం. ఏటా రూ.500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు జోన్‌లలో ఇదే తీరుగా వ్యవహారం సాగుతోందని విమర్శలున్నాయి. వీరిపై ఫిర్యాదులు చేరినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News March 2, 2026
HYD: ఇవి తింటే.. గుండె పదిలం

ఆరోగ్యకర జీర్ణ ప్రక్రయకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం అవసనమని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుముల వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.
News March 2, 2026
అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

పెళ్లి తర్వాత విజయ్-రష్మిక బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే PM మోదీ, CM రేవంత్‌ను కలిసిన ఈ కొత్త జంట తాజాగా అల్లు ఇంట సందడి చేసింది. ఈ నెల 6న అల్లు శిరీష్ వివాహం జరగనున్న నేపథ్యంలో నిన్న పెళ్లి కొడుకు వేడుక జరిగింది. దీనికి ‘విరోష్’ జోడీ హాజరైంది. వారిద్దరికీ అల్లు అరవింద్, అర్జున్ సహా కుటుంబ సభ్యులు విషెస్ తెలిపారు. కాగా ఇవాళ అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.


