News January 25, 2025
జీకేవీధి: జర్రెలలో శతాధిక వృద్ధుడు మృతి

జీకేవీధి మండలంలోని జర్రెలలో 115 ఏళ్ల వయసున్న సాగిన భాస్కర్ రావు మృతి చెందారు. ఈ ప్రాంతంలోని పిల్లలకు పాఠాలు చెబుతూ గుర్తింపు పొందారు. వందేళ్లపై వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఉంటూ పిల్లలకు పాఠాలు చెబుతుండడంతో పంతులు బుడ్డడు అని పిలిచేవారు. ఉత్సాహంగా ఉండే ఆయన శుక్రవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఆయన వద్ద చదువుకున్న శిష్యులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News February 10, 2025
KMR: ‘క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి’

ప్రతి పోలీసు విధి నిర్వహణలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని పోలీసు సీనియర్ అధికారులు సూచించారు. KMR జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు ఇటీవల నూతనంగా నియామకమైన కానిస్టేబుల్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలను కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ వివరించారు.
News February 10, 2025
కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.
News February 10, 2025
ధన్వాడ: బీజేపీకి సీనియర్ నాయకుడు రాజీనామా

ధన్వాడ మండలం బీజేపీలో అంతర్గత విభేదాలతో సీనియర్ నాయకుడు ఎర్రగుంట్ల విజయకుమార్ సోమవారం బీజేపీకి రాజీనామ చేశారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడిన విజయ్ కుమార్‌ను కాదని శివరాజ్ సాగర్‌కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆయనతో పాటు శ్రీనివాసులు మరికొందరు పార్టీని వీడారు.