News February 2, 2025
జీడిమెట్లలో హార్టికల్చర్పై స్పెషల్ ట్రైనింగ్

తెలంగాణ హార్టికల్చర్ విద్యార్థులకు జీడిమెట్లలో MIA ప్లాంటింగ్, హార్టికల్చర్ సెంటర్లో స్పెషల్ ట్రైనింగ్ అందించినట్లుగా డాక్టర్ సుకుంద తెలిపారు. ఫార్మర్ ట్రైనింగ్ విద్యార్థులకు ఎంతో అవసరమని డాక్టర్ వివరించారు. ప్రస్తుతం అగ్రికల్చర్ రంగంలో విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
News October 27, 2025
కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సోమవారం 3 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07132 నరసాపురం-తిరుపతి, నం.07033 నరసాపురం-మైసూరు, నం.07445 కాకినాడ-లింగంపల్లి మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో, ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 27, 2025
తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్ ఎక్స్ప్రెస్ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.


