News March 31, 2025
జీలుగుమిల్లి: అయ్యో పాపం.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి ప.గో జిల్లా జీలుగుమిల్లి(M) తాటియాకులగూడెంలో ఇటీవల హత్యకు గురైన గంధం బోసు హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోసు భార్య శాంతకుమారి ఆదివారం జైల్లో ఉరివేసుకుని మృతిచెందారు. దీంతో వారి పిల్లలు చెర్రీ(8), ఆరాధ్య(7) అనాథలయ్యారు. ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటో తెలియట్లేదు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారుల పరిస్థితిని చూసిన స్థానికులు అయ్యో పాపం వీరికి ఎంత కష్టమొచ్చిందో అని అంటున్నారు.
Similar News
News October 26, 2025
ఆచంట: ఆస్తుల పంపకాల్లో గొడవ.. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. ఆచంట పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిన్న సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
ప.గో: రైతులకు తుఫాను భయం

ప.గో జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజానీకం అల్లాడుతోంది. ముఖ్యం తుఫాను భయంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. పంటలు చేతికొస్తున్న సమయంలో వర్షంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాలు, లంక గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
News October 26, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.


