News March 14, 2025

జీలుగుమిల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

image

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెంకు చెందిన కొర్సా సత్తిబాబు (35) మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News March 15, 2025

నాగసముద్రంలో 41°C ఉష్ణోగ్రత

image

అనంతపురం జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం జిల్లాలోని నాగసముద్రంలో ఏకంగా 41°C ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

News March 15, 2025

ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

image

ఏపీఈఏపీ సెట్ 2025కు శనివారం నుంచి ఏప్రిల్ 24వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. అపరాధ రుసుము రూ10,000 చెల్లింపుతో మే16 వరకూ అప్లై చేసుకోవచ్చన్నారు. మే19-27 వరకూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. JNTU వర్సిటీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

News March 15, 2025

చిట్యాల: యువకుడికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

image

తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకున్న అజయ్ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. చిట్యాల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన నల్ల అజయ్ 2018లో కానిస్టేబుల్, 2024లో గ్రూప్-4, 2025లో ఏకంగా గ్రూప్-2లో స్టేట్ 43, గ్రూప్-3లో 26 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం అజయ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.  

error: Content is protected !!