News March 21, 2025
జీవనోపాధికి వెళ్లి కువైట్‌లో గుండెపోటుతో మృతి

జీవనోపాధికి కువైట్ వెళ్లిన సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్ (34) ఈ నెల 18న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో కారు డ్రైవర్‌గా పని చేసేందుకు సాగర్ కువైట్ వెళ్లారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ గత ఏడాది జులైలో కువైట్ వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News April 22, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 22, 2025
అన్నమయ్య: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

అన్నమయ్య జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
News April 22, 2025
నెల్లూరులో ఇద్దరి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని న్యూ ఎల్బీ కాలనీలో మేస్త్రీ వెంకటేశ్ (42) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విడవలూరులోని గొళ్లపాళేనికి చెందిన నాగార్జున స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.