News April 9, 2025

జీవన్ రెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ విప్

image

పెగడపల్లి మండలం బతికేపెల్లిలో మాజీ MLC జీవన్ రెడ్డి మా కాలగిరి ముత్యం రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముత్యం రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డిని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.

Similar News

News October 16, 2025

ఇదే నాకు చివరి దీపావళి: యువకుడి ఎమోషన్

image

తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ యువకుడు(21) Redditలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘2023లో పెద్దపేగు క్యాన్సర్ అని తెలిసి ఎన్నో రోజులు ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. స్టేజ్4లోని నేను ఇంకో ఏడాదే ఉంటానని డాక్టర్లు చెప్పారు. వీధుల్లో దీపావళి సందడి కన్పిస్తోంది. నాకు ఇవే చివరి వెలుగులు, నవ్వులు. నా జీవితం, కలలు కరిగిపోతున్నాయనే బాధ కుటుంబంలో చూస్తున్నా’ అని చేసిన పోస్ట్ ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.

News October 16, 2025

జిల్లాలో పనులు త్వరగా పూర్తిచేయాలి: ఫైజాన్ అహ్మద్

image

జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, EGS నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్మణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News October 16, 2025

జగిత్యాల : మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఈ నెల 18, 20, 21 తేదీల్లో దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకు రాకూడదని పేర్కొన్నారు. తిరిగి ఈనెల 22 నుంచి మార్కెట్ యార్డులో క్రయ, ఎకరాలు యధావిధిగా జరుపబడునని అన్నారు.