News April 9, 2025

జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి: సీతక్క

image

సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక అభివృద్ధి సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న పలు మహిళా శిశు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సదస్సులో సీతక్క వివరించారు.

Similar News

News December 12, 2025

దివ్యాంగుడి సమస్య విన్న కలెక్టర్

image

భీమవరం మండలం గూట్లపాడుకి చెందిన గౌరీ శంకరరావు కుటుంబ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశానికి వచ్చారు. వీరిని చూసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి దివ్యాంగుడు శంకర్ పరిస్థితిని చూసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉండడంతో దివ్యాంగ ఫించన్ రూ. 6 వేల వస్తోందని, వందశాతం అంగవైకల్యం ఉన్న తనకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని కోరాడు. ఈ అర్జీని కలెక్టర్ అధికారులకు సిఫార్సు చేశారు.

News December 12, 2025

మూడవ విడత ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలు అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లిలో రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

News December 12, 2025

మోతాదుకు మించి ఎరువులు వద్దు

image

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.