News March 21, 2025
జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.
Similar News
News October 28, 2025
విశాఖలో రేపు కూడా సెలవే: కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు బుధవారం సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ తీవ్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా ఈరోజు వరకే సెలవులు ఇస్తూ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 28, 2025
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విశాఖ కలెక్టర్ పర్యటన

విశాఖలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కైలాసపురం, శాంతి నగర్, కస్తూరి నగర్, మాధవధార అంబేద్కర్ కాలనీలో కొండచరియలు ఇళ్లపై పడడంతో పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 28, 2025
విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.


