News October 30, 2024

జీవీఎంసీకి రాష్ట్రస్థాయి అవార్డు

image

జీవీఎంసీ 2023- 24వ సంవత్సరమునకు గానూ పీఎం స్వనిధి పథకాన్ని అమలు పరచడంలో జీవీఎంసీ రాష్ట్రస్థాయి అవార్డును పొందిందని యుసిడి డైరెక్టర్ సత్యవేణి తెలిపారు.మంగళవారం అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతులమీదుగా విజయవాడలో కమిషనర్ సంపత్ కుమార్ అందుకున్నారు. స్వనిది పథకంలో 20,697 దరఖాస్తులు యుసిడి విభాగం అధికారులు అమలు పరిచినట్లు తెలిపారు.

Similar News

News December 13, 2025

ఏయూ తెలుగు విభాగం రికార్డ్: 52 మందికి ఉపాధ్యాయ కొలువులు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అరుదైన రికార్డు సృష్టించింది. మెగా డీఎస్సీ-2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. వీరిని శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఏ.నరసింహారావు పాల్గొని కొత్త టీచర్లను అభినందించారు. వందేళ్ల ఏయూ చరిత్రలో ఇదొక మధుర ఘట్టమని ఆచార్య అప్పారావు పేర్కొన్నారు.

News December 13, 2025

హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

image

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్‌ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

News December 13, 2025

నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

image

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.