News March 25, 2025
జీవీఎంసీలో ఏ కార్పొరేటర్‌పైనా ఒత్తిడి తేలేదు: MLC పిడుగు

జీవీఎంసీ మేయర్ పీఠం కోసం ఏకార్పొరేటర్ పైనా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని జనసేన MLC పిడుగు హరిప్రసాద్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని కార్పొరేటర్లు గ్రహించారని దీంతో వారంతా మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అధికార బలంతో గతంలో జీవీఎంసీలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.
News November 28, 2025
రేపు విశాఖ రానున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. డిసెంబర్ 4న నేవీ డేకి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్.. మారుతీ జంక్షన్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చేరుకుంటారు.
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.


