News January 26, 2025
జీవీఎంసీలో 1200 కేజీల ప్లాస్టిక్ సీజ్
జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకు 1200 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ తెలిపారు. జనవరి ఒకటి నుంచి జీవీఎంసీ సిబ్బంది పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Similar News
News February 5, 2025
రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే..
రాయగడ డివిజన్ పరిధిలో <<15366937>>రైల్వే లైన్లు<<>> రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్ రైల్వేస్టేషన్‌ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.
News February 5, 2025
KGHలో రౌడీషీటర్ హల్‌చల్
విశాఖ కేజీహెచ్‌లో రౌడీషీటర్ బుధవారం హల్‌చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్‌లైన్‌ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
News February 5, 2025
గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్
గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు.