News March 24, 2025
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటాం: కన్నబాబు

సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. టీడీపీ నీతిలేని రాజకీయం చేస్తుందని ఆరోపించారు. తాము జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు. విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న సింహాచలంలో స్వామిని దర్శనం చేసుకొని.. దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమౌతారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో చర్చించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
News November 19, 2025
విశాఖ కమీషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి: రాయపాటి

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ డా.రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఏయూ సెమినార్ హాల్‌లో దుర్గాబాయి దేశ్ ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రతను నిలబెట్టడం, విజయానికి బెంచ్ మార్కింగ్ భవిష్యత్తును నిర్ధారించే అంశాలపై సెమినార్ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాకు ‘సేఫెస్ట్ సిటీ’ అని ర్యాంకింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు.


