News February 25, 2025
జీవీ రెడ్డి రాజీనామా బాధాకరం: ఆదోని ఎమ్మెల్యే

ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడం బాధాకరమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆయనను రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరతామన్నారు. జీవీరెడ్డి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని.. ఆయనను కన్విన్స్ చేసి మళ్లీ రాజకీయాల్లోకి యాక్టివ్ చేయాల్సిన బాధ్యత ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోనూ అధికారులు తమ మాట వినట్లేదని తెలిపారు.
Similar News
News November 10, 2025
కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
News November 9, 2025
కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలులోని నిర్మల్ నగర్లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.


