News May 8, 2024

జీహెచ్ఎంసీని సందర్శించిన శిక్షణ ఐఏఎస్‌లు

image

నగరాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ అవలంబిస్తున్న పథకాలను కమిషనర్ రోనాల్డ్ రాస్ శిక్షణ ఐఏఎస్‌లకు వివరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెమోగ్రఫీ, శానిటేషన్, చెత్త సేకరణ, డిస్పోజల్, సీ అండ్ డీ అడ్మినిస్ట్రేషన్, ఆస్తి పన్ను వసూలు తదితర పథకాలను ఆయన వివరించారు. సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శిక్షణ ఐఏఎస్‌లు పాల్గొన్నారు.

Similar News

News October 12, 2024

హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?

image

దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి

image

శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లి, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News October 12, 2024

HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.