News January 10, 2025

జీహెచ్ఎంసీ గ్రౌండ్లను సిద్ధం చేయడంపై FOCUS

image

HYD మహానగరానికి క్రీడలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి దశలో 3 మైదానాలను నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్‌తో అభివృద్ధి చేయనుంది. అంబర్‌పేట, గోల్కొండ, విజయనగర్ కాలనీలోని మైదానాలను దీనికి అధికారులు ఎంపిక చేశారు. త్వరలోనే డిజైన్లు సిద్ధం కానున్నాయి. ఎంపికైన గ్రౌండ్లలో అంబర్‌పేట మైదానం 3.153 ఎకరాలు, గోల్కొండ ఒవైసీ ప్లేగ్రౌండ్ 1.878 ఎకరాలు, విజయనగర్ కాలనీలో 1.853 ఎకరాల్లో ఉంది.

Similar News

News January 25, 2025

ECILలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

image

కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ.1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ.70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు JAN 31 చివరి తేదీ.
SHARE IT

News January 25, 2025

HYD: KCR చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి చేశారు: ఎంపీ

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలని, అప్పుడే అన్నీ సజావుగానే కనిపిస్తాయని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ..కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్‌లో మంత్రివా లేక KCR ఫామ్ హౌస్‌లో పాలేరువా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10ఏళ్లలో KCR చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలోనే చేసి చూపించారని, KTRతేలేని పెట్టుబడులను తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తున్నామన్నారు.

News January 25, 2025

HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!

image

నగరంలో‌ మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్‌ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికితోడు ఆకతాయిలు చేసే స్టంట్‌లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.