News October 11, 2024
జీహెచ్ఎంసీ పథకాలను ప్రశంసించిన ఏపీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను గురువారం సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూమ్ వంటి విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు వివిధ విభాగాలలో తమ విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Similar News
News November 5, 2024
HYD: ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు కేటీఆర్
నేడు ఆటో డ్రైవర్లు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహించనున్నారు. కాగా ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఈరోజు నిర్వహించే మహా ధర్నాను అన్ని వాహన సంఘాలతో కలిసి విజయవంతం చేస్తామని ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.
News November 5, 2024
HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం
అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.
News November 5, 2024
HYD: మీసేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
HYDలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన మీ సేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మీ సేవ కేంద్రాలలో 150కిపైగా ప్రభుత్వ, 600 ప్రైవేట్ సంబంధిత ఆన్‌లైన్ చెల్లింపుల సేవలు సులువుగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మీ సేవ కేంద్రాల ఏజెంట్లు పాల్గొన్నారు.