News February 10, 2025
జీ.కోడూరు సర్పంచ్ సస్పెండ్

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జీ.కోడూరు పంచాయతీ సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మినీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీవో సీతామాలక్ష్మి తెలిపారు. సర్పంచ్‌ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉప సర్పంచ్‌కి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
పుట్టపర్తిలో అధికారులతో కలెక్టర్ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.
News March 15, 2026
ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.
News March 15, 2026
నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


