News March 10, 2025
జుక్కల్‌కు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి.
Similar News
News March 23, 2025
విశాఖలో సందడి చేసిన చిత్రబృందం

విశాఖలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రబృందం సందడి చేశారు. ఆదివారం విశాఖలో ఒక హోటల్లో మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఇది సిద్ధమవుతోందన్నారు. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు. హీరోయిన్ దీపికా ఉన్నారు.
News March 23, 2025
అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
News March 23, 2025
బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.