News January 24, 2025
జుక్కల్: చికెన్ కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ అనే వ్యక్తి ఈనెల 23న సాయంత్రం పెద్ద ఏడ్గి గ్రామానికి బైక్‌పై చికెన్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 20, 2025
PHOTOS: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. మార్చి 1 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
News February 20, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా నేర వార్తల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నేరా వార్తల వివరాలు.. సిరిసిల్లలో 22 గంజాయి కేసులు:ఎస్పీ అఖిల్ మహాజన్ @కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ కృష్ణ@ఎల్లారెడ్డిపేట మండలంలో గుడి మెట్ల ధ్వంసం ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు:ఎస్సై రమాకాంత్@ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తి వీరంగం@సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..కేసు నమోదు:ఎస్సై శ్రీకాంత్ గౌడ్ @ముస్తాబాద్ మండలంలో పిడిఎస్ రైస్ పట్టివేత:ఎస్సై గణేష్
News February 20, 2025
ఫాస్టాగ్ 70 నిమిషాల రూల్‌పై NHAI క్లారిటీ

టోలోప్లాజాకు చేరుకునే ముందు 60 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్‌లో ఉంటే డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. FEB 17 నుంచి అమల్లోకి వచ్చిన తాజా నిబంధనలతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై NHAI క్లారిటీ ఇచ్చింది. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంక్ మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి NPCI ఈ సర్క్యూలర్ జారీ చేసిందని వెల్లడించింది.