News March 5, 2025

జుక్కల్‌: చెరువులో పడి వ్యక్తి మృతి

image

జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో గంగారాం అనే వ్యక్తి బుధవారం ఉదయం గ్రామంలోని చెరువులోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి మృతి చెందినట్లు ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పంచనామ నిర్వహించి బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.

Similar News

News October 27, 2025

NLG: జిల్లాలో మొంథా అలజడి

image

జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మొంథా తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలు, ఈదురు గాలులు కారణంగా వందల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో ఏకంగా రోడ్డు తెలిపోయింది.

News October 27, 2025

కుక్కల వ్యవహారం.. సీఎస్‌లకు సుప్రీం సమన్లు

image

దేశవ్యాప్తంగా వీధి కుక్కల కేసులో తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌లు హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను Nov 3కు వాయిదా వేసింది. కాగా కుక్కల వ్యవహారంలో TG, WB మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి.

News October 27, 2025

HYD: నిద్రలో గురక పెడుతున్నారా?

image

నిద్రలో శ్వాస లోపాలపై నిమ్స్‌లో అవగాహన సదస్సు జరిగింది. డైరెక్టర్ ప్రొ.నగరి బీరప్ప మాట్లాడుతూ.. ‘ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)ను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది గుండె, మధుమేహంపై ప్రభావం చూపుతుంది’ అన్నారు. ప్రొ.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. గురక తీవ్ర వ్యాధికి సంకేతం. ఇది రక్తపోటు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. పాలీ సామ్‌నోగ్రఫీ (Sleep Study) ద్వారా వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు. SHARE IT.