News November 22, 2024
జుక్కల్: న్యూ MLA.. న్యూ ట్రెండ్..!

జుక్కల్కి కొత్తగా పరిచయమై, హ్యాట్రిక్ వీరుడు మాజీ MLA హన్మంత్ షిండేను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన తోటలక్ష్మీకాంత్ రావు జుక్కల్ రాజకీయాల్లో చరిత్రను తిరగ రాశారు. రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా AMC ఛైర్మన్ల నియామకాల్లో ఇంటర్వ్యూ నిర్వహించి కొత్త ఒరవడిని సృష్టించి మరోసారి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నారు. మంత్రులు, ప్రముఖులు సీఎం సైతం శభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.
Similar News
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
News November 21, 2025
NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.
News November 21, 2025
ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి నిజామాబాద్ రచయితకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.


