News March 26, 2025
జుక్కల్: పదో తరగతి ప్రశ్నలు లీక్

పదో తరగతి గణిత పరీక్షకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు లీకైన ఘటన జుక్కల్‌లోని ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ఓ విద్యార్థి గణితం ప్రశ్నలు పేపర్‌పై రాసి బయటకు పారేశాడు. ఈ లీకైన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం వెలుగులోకి రావడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, DEO రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని ఘటనపై విచారణ చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
అఖండ-2 వాయిదా.. బాలయ్య తీవ్ర ఆగ్రహం?

అఖండ-2 సినిమా రిలీజ్‌ను <<18473406>>వాయిదా<<>> వేయడంపై బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఫైనాన్స్ ఇబ్బందులను దాచడంపై నిర్మాతలతోపాటు డైరెక్టర్ బోయపాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఆటలు వద్దని, సాయంత్రంలోపు విడుదల కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్పటికప్పుడు బడా ప్రొడ్యూసర్లు 14 రీల్స్ నిర్మాతలకు కొంత సాయం చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
News December 5, 2025
మూడేళ్లల్లో ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్: మంత్రి లోకేశ్

మూడేళ్లలో ఆంధ్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేశ్ వెల్లడించారు. భామని మండలంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మన్యం జిల్లాలో విద్యార్థులను సానబెడితే అద్భుతాలు సాధిస్తారన్నారు. గత మూడేళ్లుగా మన్యం జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణత స్థానంలో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మరింత కష్టపడి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


